మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 24: చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ కావడంతో అశ్వారావుపేటలో విద్యార్ధులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ల్యాండింగ్ ప్రత్యక్షప్రసారం ద్వారా గురువారం సాయంత్రం వీక్షించిన విద్యార్ధలు భారతదేశ శాస్త్రీయతకు తిరుగులేదని అభిప్రాయపడ్డారు. ప్రయివేటు విద్యాసంస్థల ఆద్వర్యంలో గురువారం పట్టణ వీధుల గుండా భారీవిజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రతీ విద్యాసంస్థనుండి విద్యార్ధులందరూ పొట్టి శ్రీరాములు విగ్రహకూడలి వద్దకు చేరుకొని అక్కడి నుండి ప్టటణ వీధుల గుండా స్థానిక రింగురోడ్ వరకు ర్యాలీ నిర్వహించి జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో బిసి గురుకుల విద్యార్ధులు, గౌతమీస్కూల్, సూర్యస్కూల్, జవహర్ విద్యాలయం విద్యార్ధులు, యాజమాన్యాలు ఉపాధ్యాయులు, వాసవీక్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
