మృతుని దహన సంస్కారాలకు రూ.10వేల ఆర్థిక వితరణ
*ఔదార్యం చాటుకున్న దాట్ల వాసు బాబు
*రేగా కాంతారావు ఆదేశాలతో పదివేల రూపాయల సాయం
మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని టీ.కొత్తగూడెం గ్రామానికి చెందిన శెట్టిపల్లి మహేష్ (30) గుండెపోటుతో మరణించడం జరిగింది. మహేష్ కుటుంబాన్ని జడ్పిటిసి సుభద్రాదేవి వాసు బాబు, సర్పంచ్ ఇనుకుర్తి నాగలక్ష్మి , వార్డ్ మెంబర్లు పరామర్శించారు. పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, రేగా కాంతారావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి పదివేల రూపాయలను దహన సంస్కారాల నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో , గ్రామ అధ్యక్షుడు టి నరేష్, పంచాయితీ కార్యదర్శి అనుష ,వార్డు మెంబర్లు సతీష్, గంగరాజు, గ్రామస్థులు దొడ్డ రాజు, పానెం ఆది నారాయణ, సాంభశివరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.