UPDATES  

 రేగా కృషి..ఏళ్లనాటి రహదారి కల నెరవేరుతున్న వేళ

రేగా కృషి..ఏళ్లనాటి రహదారి కల నెరవేరుతున్న వేళ
*నాడు మోకాళ్ళ లోతు నీళ్ళ లో ప్రయాణం… నేడు ఆ గోస తీరింది
*రూ.2కోట్ల తో ఇరవెండి రహదారి నిర్మాణం పనులు
*పలు గ్రామాల ప్రజలకు, రైతులకు తీరనున్న అవస్థలు
* మేము మరవం ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి
*ఇరవెండి, పై కొత్తూరు, రామచంద్రపురం గ్రామాల ప్రజలు
అశ్వాపురం, మన్యం, న్యూస్: తాత ,ముత్తాతల కాలంనుండి హరిగోశపడ్డారు ఆ గ్రామాల ప్రజలు… వర్షం కురిస్తే బయటి గ్రామాల ప్రజలతో కమ్యూనికేషన్ కట్. చేను పనులకు వెళ్లాలన్న రైతులు వెళ్లలేని దుస్థితి . ఎందరో ఎమ్మెల్యేలకు ఇరవండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విన్నవించుకున్న ఫలితం లేదు . వి నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వారి సమస్యను విన్నవించారు. వారు అడిగింది తడువుగా ఇరవెండి రహదారి నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేశారు . పలు గ్రామాల హరిగోస తీర్చిన ఇరవండి రహదారిపై మన్యం న్యూస్ ప్రత్యేక కథనం.
మండలంపరిధి మణుగూరు టు భద్రాచలం వెళ్లే దారి వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు నీట మునుగుతుంది.మొండికుంట మల్లెమడుగు రామచంద్రాపురం గ్రామ ప్రజలకు భద్రాచలం వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.అదే విధంగా ఇరవెండి పై కొత్తూరు గ్రామ ప్రజలకు సరైన రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అది గమనించిన ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు ఇరవైండి, పై కొత్తూరు గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల నాటికలరామచంద్రాపురం నుండి ఇరవెండి పై కొత్తూరు వెళ్లే దారిని రెండు కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.ఈ రహదారి ఇరవైండి పై కొత్తూరు గ్రామ ప్రజలకు ఎన్నో ఏళ్ల నాటికల 40 కుటుంబాలకు వర్షాకాలంలో ఆ దారిలో వెళ్లాలంటే మోకాళ్ల లోతులో బురదమయంతో కూడుకొని ఉండేది. పాఠశాలలకు వెళ్లే పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇబ్బందికరంగా ఉండేది.ఇటు వరద సమయంలో అతి భారీ వర్షాల సమయంలో వయా నెల్లిపాక బంజర రామచంద్రపురం భద్రాచలం టు మణుగూరు రహదారి నీట మునగడంతో పాటు ఆ రోడ్డు అందరికీ చాలా విధాలుగా ఉపయోగపడుతుందని అదేవిధంగా రామచంద్రాపురం గ్రామ ప్రజలు ఎక్కువగా వ్యవసాయ పనులకు అదే దారిలో వెళ్తారు.వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రెండు కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.పై కొత్తూరు గ్రామ ప్రజలకు ఎన్నో ఏళ్ల నాటికలను సహకారం చేసిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఆ రహదారి వలన ఇటు మొండికుంట ,మల్లెమడుగు, రామచంద్రాపురం, ఇరవైండి, పై కొత్తూరు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని హర్షం వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !