మా ఊరి గ్రామ ప్రజలకు ఈ రోడ్డు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.మా ఊరిలో ప్రతి ఒక్కరూ వ్యవసాయా పొలాలకు వెళ్లాలంటే ఇదే దారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చాలా ఇబ్బందికరం.అడుగు కూడ వెయ్యలేని పరిస్థితి. వరదలు వచ్చినప్పుడు రామచంద్రపురం స్టేజి దగ్గర రహదారిమునిగిపోయేది. ఐటిసి బిపిఎల్ కి వెళ్లే వాళ్ళు మొండికుంట మీదుగా బిపిఎల్ ఎక్స్ రోడ్డు నుంచి వెళ్లేవారు. వారికి సమయం వృధా .కిలోమీటర్లు ఎక్కువ వెళ్లాల్సి ఉంటుంది . కానీ ఇప్పుడు ఈ రహదారి నుండి వెళ్తున్నారు.ఈ రోడ్డు శాంక్షన్ చేపించిన పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకి మా గ్రామ పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
