ఎమ్మెల్యే రేగా కు ఋణపడి ఉంటాము:కొరస లక్ష్మీ,
సర్పంచ్, ఇరవెండి పంచాయతీ
ఇరవెండి ,పైకొత్తూరు గ్రామ ప్రజలకు రోడ్డు లేక నానా అవస్థలు పడుతున్నారు అని ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి విన్నవించుకోగా వారు వెంటనే స్పందించిఈ రోడ్డును మంజూరు చేపించి పనులు ప్రారంభించారని తెలిపారు.గతంలో ఎమ్మెల్యే లకు విన్నవించుకున్నాం కానీ పట్టించుకున్న నాధుడే లేడు. ఇరవెండి ప్రజలకు వ్యవసాయ పొలాలకు వెళ్లే వాళ్లకు,ఇరవెండి పైకొత్తూరు గ్రామ ప్రజలువర్షాకాలంలో బయటికి రాలేని పరిస్థితులు ఉండేవికానీ బీటీ రోడ్డు వలన వారి పనులు సులభంగా,విద్యార్థులు పాఠశాలలకు సులభంగా వస్తున్నారు.ఎల్లనాటి కల నెరవేర్చిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఇరవెండి సర్పంచ్ కోరసా లక్ష్మి అన్నారు.
