తల వంచుకునే పరిస్థితి వస్తే నా తల నరుక్కుంటా: తుమ్మల ఉద్వేగం
ఖమ్మం :
ఉభయ జిల్లాలో నా వల్ల ఎవరైన తల వంచుకునే పరిస్థితి వస్తే నా తల నరుక్కుంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్వేగంగా మాట్లాడారు. తనకు పాలేరులో టికెట్ రాకపోవడంతో కొంతమంది శునకానందం పొందారన్నారు. తన కర్తవ్యం, ధర్మం ప్రజల కోసమే అని వారి కోసమే వచ్చే ఎన్నికల్లో నిలబడుతున్నట్లు స్పష్టం చేశారు.