మన్యం న్యూస్ మణుగూరు: ఆగస్టు 25
మణుగూరు పట్టణ పరిధిలో రోడ్ పై వ్యాపారాలు చేసుకుంటూ,జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారస్తులకు,ఎండకు,వానకు,వారి వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా,ఉండటం కోసం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో వీధి వ్యాపారస్తులకు బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు గొడుగులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశేట్టి రవి ప్రసాద్, బిఆర్ఎస్వీ పినపాక నియోజకవర్గం అధ్యక్షులు తాళ్ళపల్లి రాహుల్ గౌడ్, జాగృతి జిల్లా అధ్యక్షులు పవన్ పవన్ నాయక్,దుర్గ ప్రసాద్,సందీప్,కోరి భరత్, మట్టపల్లి సతీష్,నితిన్,కార్తిక్, శ్రీను దొర,సునీల్,సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.