మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
సాంప్రదాయాలను మరువబోము..తమ న్యాయమైన డిమాండ్ పరిస్కారం కోసం ప్రభుత్వం జరుగుతున్న పోరాటంలో వెనుకడుగు వేయబోమంటూ రెండో ఏఎన్ఎంలు శుక్రవారం వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. క్రమబద్దీకరణ డిమాండుపై రెండో ఏఎన్ఎంలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి పదో రోజుకు చేరుకుంది. శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్టరేట్ ధర్నా చౌకులో నిరసన శిభిరాన్ని ఏర్పాటు చేసుకున్న రెండో ఏఎన్ఎంలు శిబిరంలోనే సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. సాంప్రదాయపద్ధతిలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అనుబంధ రెండో ఏఎన్ఎం యూనియన్ జిల్లా నాయకులు ఎండి.సజ్జుబేగం, బానోతు ప్రియాంక, కౌసల్య, అరుణ, రాములమ్మ, పార్వతి, పుష్ప, బాల నాగమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.