UPDATES  

 హీరో గ్లామర్ -125 బైక్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

 

మన్యం న్యూస్ మణుగూరు ఆగస్టు 25

మణుగూరు మండలం లోనీ శ్రీ భార్గవ ఆటోమొబైల్స్ లో హీరో మోటో కార్ప్ ప్రవేశ పెట్టిన న్యూ గ్లామర్ -125 సిసి బైక్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలిత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగా కాంతారావును షోరూం నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించి మెమొంటోలను అందజేశారు. ఈ సందర్బంగా శ్రీ భార్గవ ఆటోమొబైల్స్ యజమాని నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 2020 కు ముందు తెలంగాణ ప్రజల కు ఎంతో ప్రీతి పాత్రమైన గ్లామర్-125 ను ప్రజల కోరిక పై మళ్ళీ హీరో మోటో కార్ప్ లాంచ్ చేసింది అన్నారు. ఇందులో మల్టీఫుల్ డిజిటల్ కాంసోల్,రియల్ టైమ్ మైలేజ్ ఇండికెటర్,మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కలిగి ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు పోశం నరసింహారావు, కామిరెడ్డి శ్రీలత,స్థానిక ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అన్వర్,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !