మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని గాజుల రాజం బస్తి ఏరియాలో ఉన్న అంగన్వాడి సెంటర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక సందర్శించారు. అంగన్వాడి సెంటర్లో పిల్లలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లల మధ్య సాధారణ గృహిణిల కలెక్టర్ కూర్చుని వారు చేస్తున్న సందడిని చూసి మురిసిపోయారు.