ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాడుతాం…. సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
150 కుటుంబాలు సిపిఎంలో చేరిక సాదరంగా ఆహ్వానించిన పార్టీ నాయకులు
మన్యం న్యూస్ చర్ల:
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీ వెంట తాం సైతం నడుస్తామని కేశవాపురం పంచాయతీలోని కేశవాపురం గుంపెనగుడం గ్రామాలకు చెందిన 150 కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు నియోజకవర్గం కారం పుల్లయ్య పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం మండల కమిటీ సభ్యురాలు పొడుపుగంటి సమ్మక్క అధ్యక్షత పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ అవిశ్రాంతంగా పోరాడుతుందని గుర్తు చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సిపిఎం పనిచేస్తుందని పేర్కొన్నారు. వరద ముంపు బాధితులైన కేశవాపురం గుంపెనగుడం తదితర గ్రామాల ప్రజలకు మేరక ప్రాంతంలో ఇంటి స్థలాలు కేటాయించి గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ పరిధిలో రోడ్లు మంచినీళ్లు వీధిలైట్లు డ్రైనేజీ సమస్యలు ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం పరిష్కారం చేయలేదని సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వం భద్రాచలం నియోజకవర్గం ఈ ప్రాంత ప్రజల పట్ల తీవ్రమైన యువక్షత చూపుతుందని దళిత బంధు బీసీ బందు మైనారిటీ రుణ సహాయాల్లో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వీటి మీద సమగ్ర విచారణ జరపాలని సిపిఎం డిమాండ్ చేసింది. గ్రామ సభల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరగాలని సిపిఎం డిమాండ్ చేసింది దళితులు బీసీలు ఇతర సామాజిక తరగతుల్లోని పేదలందరికీ ఎటువంటి షరతులు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని సిపిఎం పోరాడుతుందని పేర్కొన్నారు 1970కు ముందే నివాసం ఉన్న వారికే గృహ లక్ష్మీ పథకం అనేటువంటి నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రతి సమస్య పైన నిబద్ధతతోటి అంకితభావంతోటి పట్టుదల తోటి పోరాటం చేస్తుంద డిమాండ్ చేశారు. అనంతరం రమాదేవి, పుచ్చకాయల శ్రీదేవి, పుచ్చకాయల దుర్గ తదితరుల నాయకత్వంలో రెండు గ్రామాల నుంచి రవి 150 కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరినట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వేపాకుల శ్రీనివాస్ పార్టీ మండల కార్యదర్శి కారం నరేష్ పార్టీ మండల కమిటీ సభ్యులు మచ్చా రామారావు పామరు బాలాజీ దొడ్డి హరినాగ వర్మ శ్యామల వెంకటేశ్వర్లు తాళ్లూరి కృష్ణ కొమరం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.