మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండలం సుదిమళ్ళ గ్రామ పంచాయితీకి చెందిన చింత సుమన్ (32) తన పత్తి చేనులో ట్రాక్టర్ తో పత్తిపాటు చేసి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ట్రాక్టర్ పల్టి కొట్టి అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులు నిమిత్తం ట్రాక్టర్ తో ఇంటినుంచి బయల్దేరిన వ్యక్తి సాయంత్రానికి శవమై ఇంటికి చేరాడు, సంఘటనతో ఊరంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ లు కేస్ నమోదు చేసుకుని పంచనామా నిర్వహించారు.