మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి కొన్ని కుటుంబాలు స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం చేరడం జరిగింది. చుంచుపల్లి మండలం పెనగడప గ్రామానికి చెందిన 20 కాంగ్రెస్ కుటుంబాల వారు బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కరుణాకర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ నాయక్, రామన్ తదితరులు పాల్గొన్నారు.