- ఆరు దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ
- ఈ నెల 28న మంత్రి అజయ్ కుమార్ చేతులమీదుగా ఇల్లెందు బస్సుడిపో ప్రారంభోత్సవం
- బస్ డిపోను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు:గత ఆరు దశాబ్దాలుగా ఇల్లందు బస్సు డిపోకోసం ఎదురుచూసిన నియోజకవర్గ ప్రజల కల నెరవెరబోయే సమయం ఆసన్నమైంది. ఈ నెల 28న ఇల్లెందు బస్ డిపో ప్రారంభత్సవం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతులమీదుగా నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం ఇల్లందు బస్సుడిపోను సందర్శించి ప్రారంభోత్సవానికి తగుఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడిపనులను పరిశీలించి తగుసలహాలు, సూచనలు చేశారు. ఈనెల 28 నుంచి ఇల్లందు బస్సుడిపోలో 24 బస్సులు అందుబాటులో ఉండనున్నట్లు ఆర్టీసీ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. కొత్తగూడెం డిపో నుంచి 14, ఖమ్మం డిపో నుంచి 10బస్సులు కేటాయిస్తున్నట్లు అధికారులు వివరించారు. సుమారు 100 మంది వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, ఇతర అధికారులు ఇల్లందులో పనిచేయనున్నట్లు ఎమ్మెల్యేకి సంబంధిత అధికారులు తెలిపారు. ఇకమీదట రాత్రుల్లో బస్సులేదనే బెంగ ఇల్లందు ప్రజలకు అవసరం ఉండబోదన్నారు. ప్రజల ఆకాంక్షమేరకు ఇల్లందు బస్సుడిపో ప్రారంభోత్సవం జరగనున్న సందర్భంగా మంత్రి అజయ హాజరయ్యే ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పురప్రముఖులు హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీపాషా, కొత్తగూడెం డిపోమేనేజర్ వెంకటేశ్వరావు, ఆర్టీసీ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.