మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్టు 25 : నూతనంగా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మిద్దెల జితేందర్ ను హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొదుమూరి దయాకర్ రావు శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ని గ్రామంలో గడపగడపకు ప్రచారం చేస్తున్నామని, పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.