UPDATES  

 మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి ప్రజాసేవకై హరిప్రియ ఫౌండేషన్

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
ప్రజాసేవకై హరిప్రియ ఫౌండేషన్

ఫౌండేషన్ నందు శిక్షణ పొందిన మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీచేసిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

*మన్యం న్యూస్,ఇల్లందు*మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అని ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ అన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ఎందరో జీవితాలలో వెలుగులు నింపాలని ,స్వశక్తితో తమంతట తాము అభివృద్ధి చెందేందుకై స్థానిక ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ నెలకొల్పిన హరిప్రియ ఫౌండేషన్ నందు ఏఎల్వో శాస్త్రి అధ్యక్షతన కుట్టుమిషన్ విభాగంలో శిక్షణ పొందిన మహిళలకు శుక్రవారం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ 29 ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ..ఇల్లందు నియోజకవర్గంలో ఎందరో మహిళలు తమకుటుంబ పోషణకోసం, ఉపాధికోసం ఎన్నోమైళ్ళ దూరం కూలి పనులకు వెళ్లి రోజువారి కూలి డబ్బులతో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని ప్రతి మహిళ కూడా తన స్వయంగా తమంతతాముగా అభివృద్ధిలోకి వచ్చేవిధంగా తమకు ఆసక్తి ఉన్న రంగంలో రాణించేందుకు హరిప్రియా ఫౌండేషన్ ద్వారా న్యాక్ వారి సహాయ సహకారాలతో కుట్టు మిషన్ విభాగంలో ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం శిక్షణకాలంలో మహిళలు పూర్తిచేసిన దుస్తులను ఎమ్మెల్యే పరిశీలించారు. పోటీపరీక్షలకు కూడా హరిప్రియ ఫౌండేషన్ తనవంతు సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన 29మంది మహిళలకు ఉచిత కుట్టుమిషన్లను హరిప్రియ హరిసింగ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ వెంకటరాజు, నాగమణి, కౌన్సిలర్స్ సిలివేరి అనిత, పద్మ, జెకె శీను, మండల జడ్పిటిసి వాంకుడోత్ ఉమాదేవి, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్చూరు వెంకటేశ్వరరావు, కామేపల్లి మండల అధ్యక్షుడు హనుమంతరావు, టేకులపల్లి మండల అధ్యక్షుడు, బొమ్మెర వరప్రసాద్, ఇల్లందు పట్టణ ఇంచార్జ్ సుధీర్ తోతల, ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు, ఎస్కేపాషా, గండ్రతి చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !