మహ్మద్ నగర్ లో మెగా వైద్యశిబిరం…..
అన్ని వైరల్ జ్వరాలే..
డిస్ట్రిక్ట్ సర్వేలైన్స్ అధికారి పర్షానాయక్..
మన్యం న్యూస్ చండ్రుగొండ, ఆగస్టు 25 : మహ్మద్ నగర్ గ్రామంలో వైరల్ జ్వరాలేనని జిల్లా సర్వేలైన్స్ అధికారి డాక్టర్ పర్షానాయక్ అన్నారు. శుక్రవారం తిప్పనపల్లి పంచాయతీ, మహ్మద్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ఆయన పాల్గొని, జ్వరపీడితులను పరీక్షించారు. జ్వరపీడితుల నుండి రక్త నమూనాలు సేకరించి, వైరల్ జ్వరాలేనని నిర్దారించారు. అక్కడే జ్వరపీడితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించటం జరుగుతుందన్నారు. గ్రామంలో నీటి కలుషితం కొంత వరకు జరిగి జ్వరాలు పెరిగాయని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించటం జరిగిందన్నారు. ఇంటి పరిసరాలు గ్రామంలో సరిగ్గా లేదన్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం పారిశుద్దంపై అవగాహన కల్పించాలన్నారు. జ్వరాలు కంట్రోల్ అవుతాయని, భపడాల్సిన అవసరం లేదన్నారు. మెగా వైద్య శిబిరంలో ఎంపిటీసీ లంకా విజయలక్ష్మి సౌకర్యాలు కల్పించటం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. ఆయన వెంట జిల్లా వైద్యుల బృందం బాద్యులు ఇమ్మానియల్, వెంకటప్రసాద్, మెడికల్ ఆఫీషర్ కనకం తనూజ, జిపి సెక్రటరీ శివన్నారాయణ, ఎంపిటీసీ లంకా విజయలక్ష్మి, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, పంచాయతీ సిబ్బంది,తదితరులు, పాల్గొన్నారు.