మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్టు 25 : ఇటీవల జరిగిన రాజకీయ మార్పు లో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాదు నుంచి వస్తున్న సందర్భంగా ఖమ్మంలో స్వాగతం పలకడానికి బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు ఆధ్వర్యంలో శుక్రవారం తుమ్మల అనుచరగణంతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గాదె శివప్రసాద్, అనుమల హనుమతరావు, మద్దిరాల పెద్ద పిచ్చయ్య, కాశీ,సాంబ, చాపలమడుగు లక్ష్మణరావు,తదితరులు పాల్గొన్నారు.