సీతక్క ను ఒడిస్తా…. సీఎం కేసిఆర్ సార్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా
*బడే నాగ జ్యోతి
*అడవిలో పుట్టిన ఆదివాసీ గిరిజన బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన బీ. ఆర్.ఎస్ బాస్ కేసీఆర్
సర్పంచ్ నుండి బీ. ఆర్.ఎస్
ఎమ్మెల్యే అభ్యర్థిగా ములుగు బరిలో బడే నాగజ్యోతి అక్క.
*హేమహేమీలకు దక్కని అవకాశం సీఎం కేసీఆర్ ఆశీర్వాదం నాగ జ్యోతికి
*రాజకీయ అరంగేట్రం నుండి నేటి వరకు ఓటమి ఎరగని ఆదివాసి బిడ్డ జ్యోతక్క
*మన్యం న్యూస్,వాజేడు(ములుగు): *ములుగు సీతక్కని ఓడిస్తా సీఎం కేసీఆర్ సార్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి అక్క ధీమా వ్యక్తం చేశారు. కాకులు దూరని కారడవిలో… విప్లవ జెండాల చాటున పుట్టిన బిడ్డా బడే నాగజ్యోతి.
బడే నాగజ్యోతి నేపథ్యం
మావోయిస్టు పార్టీలో సమ సమాజ స్థాపన కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రక్షాన పోరు బాట పట్టి దోపిడీదారుల నుండి విముక్తి కోసం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జిల్లాలకు ఇన్చార్జిగా వ్యవహరించిన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ అన్న,రాజేశ్వరి కూతురు బడే నాగజ్యోతి. బడే నాగజ్యోతి.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈమె ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యారు. ఎందుకంటే ములుగు నియోజకవర్గంలో సీతక్కకు పోటీగా బీఆర్ఎస్ పార్టీ ఈమెను బరిలోకి దించింది. ములుగు జిల్లా వాళ్లకు బడే నాగజ్యోతి సుపరిచితమే కానీ.. వేరే జిల్లా వాళ్లకు ఆమె అంతగా తెలియని పేరు. కానీ.. ఆమెను నమ్మి కేసీఆర్ ఎలా ములుగు టికెట్ ఇచ్చారు అనేదే ఎవ్వరికీ అంతుపట్టని విషయం.
బడే నాగజ్యోతి కి ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించడం పట్ల బడే నాగజ్యోతి అక్క ఆనంద బస్పాలతో కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యమ నేపథ్యమున్న ఆదివాసి బిడ్డకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన బిఆర్ఎస్ పార్టీకి ఆదివాసీలు,బడుగు బలహీన వర్గాలు, ములుగు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్థానం
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కేసు కాల్వపల్లి గ్రామంలో జన్మించిన బడే నాగజ్యోతి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఉద్యమ బాటలో అజ్ఞాతంలోకి వెళ్లారు.
బాల్యం… విద్యాభ్యాసం
దాదన్న నానమ్మ దగ్గర ఉండి పాఠశాల విద్యాభ్యాసాన్ని బడే నాగ జ్యోతి పూర్తి చేశారు. అనంతరం మేనత్తల దగ్గర ఉండి కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పట్టా పొందారు. ఉద్యమాల బాటలు ప్రజాసేవ చేసిన రక్తంగా జన్మించినందుకో… చిన్ననాటి నుండి ప్రజాసేవ చేయాలని, ప్రజల కొరకు జీవితాన్ని శాశ్వతంగా అంకితం చేయాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తమ స్థాయికి మించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తన జీవితాన్ని గడిపే తరుణంలో అకస్మాత్తుగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చిందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తన మంచితనానికి, మానవత్వానికి, ఉద్యమా నేపథ్యానికి, చిహ్నంగా సర్పంచ్ గా ఎన్నిక అయ్యారు.ఆ రోజు నుండి ప్రజలలో పరపతి పెరగడం, పట్టిందల్లా బంగారం కావడం అన్ని రకాలుగా అదృష్టం కలిసి వచ్చింది.2019లో జడ్పిటిసి గా ఎన్నిక, ములుగు జిల్లా వైస్ చైర్మన్ గా, ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మరణ అనంతరం 2013 జూన్ నెల నుండి జడ్పీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయ అరంగేట్రం నుండి 2023 వరకు ఓటమి ఎరగని ఆదివాసి బిడ్డ గా జ్యోతక్క కి రాజకీయ రికార్డ్ ఉంది.
ములుగులో బిఆర్ఎస్ జెండా ఎగరేస్తా:బడే నాగ జ్యోతి
వరంగల్ మైదాన ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో సు విశాలమైన అటవీ ప్రాంతంలో తాడ్వాయి గ్రామం నుండి 45 కిలోమీటర్ల దూరం కాల్వపల్లి గ్రామంలో బడే నాగజ్యోతికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ములుగు బరిలో నిలిచే అవకాశం కల్పించిన బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ములుగు గడ్డపై బిఆర్ఎస్ జండా ఎగరేసి ములుగు నియోజకవర్గాన్ని కానుకగా సమర్పించేందుకు ముమ్మరం చేశారు. జ్యోతి అక్క,విజయం అనే విత్తనం నుండి వచ్చారుగా విజయం ధరించేన ? ములుగు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క పోటీలో ఉంటారు. అనునిత్యం ప్రజాసేవ కొరకై, గ్రామాలలో తిరుగుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తూ బలమైన నాయకురాలుగా ములుగు నియోజకవర్గంలో ముద్రవేశారు. సీతక్కను ఓడించాలంటే జ్యోతక్క అస్త్రం ప్రయోగించవలసిందేనా జ్యోతక్క వ్యూహాలకు పదును పెట్టవలసిందేనా ఏది ఏమైనా ములుగులో గులాబీ జెండా సంబరాలు జరగాలనే సంకల్పంతో ములుగు ప్రజలు నిరీక్షిస్తున్నారని విశ్వాసనీయ సమాచారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దిశ దశలు అభివృద్ధి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే, మళ్లీ రాబోయే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర
ములుగు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర
ఆమె కీలకంగా వ్యవహరించారు. తాడ్వాయి జెడ్పీటీసీగా గెలుపొందిన తర్వాత ఆమెను జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గా నియమించారు. ములుగులో సీతక్కను ఓడించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కీలక నేత. అందుకే.. ఆమెను ఓడించాలంటే అదే నక్సల్స్ నేపథ్యం ఉన్న నేత అయితేనే కరెక్ట్ అని భావించిన కేసీఆర్.. బడే నాగజ్యోతిని బరిలోకి దించారు. అందుకే ఇప్పుడు బడే నాగజ్యోతి గురించి అందరూ చర్చిస్తున్నారు. కానీ.. సీతక్క బలం ముందు బడే నాగజ్యోతి నిలబడుతుందా లేదా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. బడే నాగజ్యోతి అక్క రాజకీయంలోకి అడుగు పెట్టిన నాటి నుండి నేటి వరకు ఓటమి తెలియని నాయకురాలుగా ముద్ర ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ నాగజ్యోతికి పూర్తి విశ్వాసంతో టికెట్ కేటాయించారు. కాగా బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాత్మకంగానే ములుగుజెడ్పీ వైస్ చైర్మన్ గా నియమించడం జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ త్వరలో జరుగా6 ములుగు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.