మణుగూరులో రెండవ సారి స్వల్ప భూప్రకంపనలు.
* శుక్రవారం తెల్లవారుజామున 4. 45 నిమిషాలకు 3 సెకండ్లు కంపించిన భూమి
* భయంతో ఇళ్ళ నుండి బయటకి పరుగులు తీసిన జనం
* రెక్టార్ స్కేల్ పై 3.6 గా నమోదైన భూకంప తీవ్రత
మన్యం న్యూస్ మణుగూరు:-మణుగూరు మండలం లో రెండవసారి స్వల్ప భూ ప్రకంపనలు రావడం జరిగింది. శుక్రవారం తెల్లవారు జాము సుమారు 4 గంటల 43 నిమిషాలకు స్వల్ప భూప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా ఊగిన భూమి,గృహాలు. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. మరికొందరు భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులు తీశారు.అయితే ఎలాంటి ఆస్తి,ప్రాణనష్టం జరగలేదు.అసలు ఏం జరుగుతుంది అని తెలియక సందిగ్ధంలో మునిగిపోయి ఉన్న ప్రజలు.గత వారం ఒక్క వారంలో రెండు సార్లు భూప్రకంపనలు రావడంతో మండల కేంద్రంతో పాటు మండలంలో చర్చనీయంశంగా మారింది,మరెప్పుడు ఏం జరుగుతుంది తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.మణుగూరు ఓని పూజారినగర్, రాజుపేట,కొత్తకొండాపురం,సుందరయ్యనగర్,ఆదర్శనగర్ ప్రాంతాల్లోని ప్రజలు భూప్రకంపనలను గుర్తించారు.స్థానికంగా ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లో సహజంగా బ్లాస్టింగ్ బాంబులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి 3.30గంటల సమయం వరకు మాత్రమే జరుగుతుంటాయి.మరి ఇది బాంబులు ప్రభావమా…? అనే ప్రశ్న మరి కొందరి ప్రజల్లో ఊహాగానాలు వస్తున్నాయి,అసలే మణుగూరు పట్టణంతో పాటు చుట్టూ ప్రక్కల మొత్తం భూమిలో సింగరేణి బొగ్గు తవ్వకాలు జరిగాయి మరీ ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ మణుగూరు దుస్థితి కావున సంబంధిత అధికారులు స్పందించి నిపుణుల చేత పరీక్షించి ఈ భూప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవలసిందిగా కోరుతున్న ప్రజలు.