మన్యం న్యూస్ ,వెంకటాపురం:మండల కేంద్రంలో సిఐ టీ యూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి.శ్రీను , సి ఐ టీ యూ జిల్లా సహాయ కార్యదర్శి కట్ల. నరసింహచారి, హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు…
ఆశా వర్కర్స్ కు కనీస వేతనాలు నెలకు రూ.26000 వేలు ఇవ్వాలని,అర్హత ఉన్న ఆశాలను ఏ ఎన్ ఎం లకు ప్రమోషన్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఫి.యప్,ఇ.యస్.ఐ సౌకర్యం కల్పించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్లతో నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గ్యానం.వాసు,ఆశా వర్కర్స్ మండల నాయకులు గుమాసు.నాగమణి,వాసం.ఉష, బొగ్గుల. గంగాభవాని,ముత్తునూరి.పూర్ణ,గుండారపు.అంజలి,శేల.పాప,సిఐటియు మండల నాయకులు జనగం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
