మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- హరితహరం లో బాగంగా శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క రోజులో కోటిమొక్కలు నాటే మహత్తర కార్యక్రమం ఇల్లందు మండలం లోని సీఎస్పి బస్తీ గ్రామపంచాయితిలో జరిగింది.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ వెంకన్న వారి పరివారంతో మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ, నాటిన ప్రతిమొక్కను సంరక్షించాలనీ సూచించారు. మొక్కలను పెంచకపోతే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రేంజర్ నాగేశ్వరరావు, ఫారెస్ట్ సిబ్బంది రాంసింగ్, కళ్యాణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.