మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం:
మండల పరిధివి ఆర్ కే పురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీ ఎస్ స్కూల్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక్కరోజు ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమం లో భాగంగా వెంకటాపురం మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షురాలు, వి ఆర్ కే పురం సర్పంచ్ పూనం శ్రీదేవి, బి ఆర్ఎస్ అధికార ప్రతినిధి దామోదర్, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు శనివారం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటరమణ, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, వేల్పుల నాగేష్, నరసయ్య పెంటయ్య, కన్నయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
