మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
వైద్య వృత్తి ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతుందని ఆ వృత్తిని ఎంచుకోవడం పట్ల విద్యార్థులను శిక్షణ ఇచ్చే వైద్యం అభినందించింది. భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థినీ విద్యార్థులకు శనివారం ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో “బేసిక్ లైఫ్ సపోర్ట్”పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ప్రముఖ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సూపర్ స్పెషలిటీ వైద్య నిపుణులు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ డాక్టర్ మోటూరు ధరణీంద్ర, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ షుకూర్ గుండె పోటు ఇతర అత్యవసర వ్యాధులు సంభవించినప్పుడు రోగిని హాస్పిటల్ కు తరలించే ముందు అత్యవసరంగా చేయవలసిన వైద్యపరమైన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యరంగంలో శిక్షణ పొందిన వారు అత్యవసర సమయంలో వైద్యం అందుబాటులో లేని వారికి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం ద్వారా ఎంతో విలువైన ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీనియర్ జనరల్ మేనేజర్ కోనేరు కోటేశ్వరరావు, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ అల్లూరి నాగరాజు, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు.