మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సుజాతనగర్ మండల పరిధిలో ఉన్న సింగభూపాలెం చెరువును మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సింగభూపాలెం చెరువు నీటితో ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుందని ఆ నీటిలో చేప పిల్లలను విడుదల చేయడం వల్ల
మత్స్య కారులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కేసిఆర్ కే దక్కుతుందన్నారు. శనివారం సింగభూపాలెం చెరువులో 7.40 లక్షల చాప పిల్లలను ఎమ్మెల్యే వనమా వదలడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో తెలంగాణలో మత్స్య సంపద ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. అంతేకాకుండా మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు రైతులకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భుఖ్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎమ్మార్వో శిరీష, జిల్లా ఫిషర్స్ అధికారి వీరన్న, ఎంపిటిసిలు బత్తుల మానస, పెద్దమల్ల శోభ రాణి, మూడు గణేష్, కో ఆప్షన్ సభ్యులు మీరాభి, సర్పంచులు చైతన్య, రవి, హతిరం, హీరాని, లలిత, సాంబయ్య, మండల అధ్యక్షులు తులసి రెడ్డి, కొట్టి వెంకటేశ్వర్లు, శివాలయం కమిటీ చైర్మన్ శ్యామ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు రజాక్, సాంబయ్య, తిట్ల భాస్కర్, సీతారాములు, రవీందర్, ఇస్తరయ్య, పరమేష్, రవి, జైత్రం, భీముడు, నరేందర్, సింగభూపాలెం చెరువు సొసైటీ అధ్యక్షులు బానోతు సూర్యం, కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.