UPDATES  

 బలమైన శక్తిగా బీఆర్ఎస్!

బలమైన శక్తిగా బీఆర్ఎస్!
* విప్ రేగ ఆధ్వర్యంలో గులాబీలోకి పెరుగుతున్న వలసలు
* ఇప్పటికే ఇద్దరు పెద్ద నాయకులు ప్రవేశం
* మునుముందు మరింత వలసలు పెరిగే అవకాశం
* మహా కుటుంబంగా గులాబీ సైన్యం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాజకీయం ఇప్పుడిప్పుడే వేడెక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గులాబి అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో రాజకీయ వేడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గులాబీ దళంలోకి ఇద్దరు పెద్ద నాయకులు రావడంతో పార్టీకి మరింత బలం పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడైన తెల్లం వెంకట్రావు బిఆర్ఎస్ లోకి రాగానే గులాబీ బిగ్ బాస్ ఆయనను భద్రాచలం సెగ్మెంట్ కి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గత నాలుగు సంవత్సరాలుగా బిజెపి పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన కోనేరు సత్యనారాయణ(చిన్ని)బిఆర్ఎస్ లోకి రానున్నారు. చిన్ని గులాబీలోకి వస్తున్నందుకు ఆయన ఇంటికి ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్సీ తాత మధు మూడు రోజుల కిందట సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చి గులాబి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఇలా కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులను తాజా నాయకులను బిఆర్ఎస్ పార్టీలోకి గులాబి ప్రజా ప్రతినిధులు తీసుకోవడంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆధ్వర్యంలో భారీ చేరికలు…
సీఎం కేసీఆర్ గులాబీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన మరుసటి రోజు నుండే పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ప్రతిరోజు అక్కడ చేరికలపర్వం కొనసాగుతున్నడంతో కాంగ్రెస్ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేకాకుండా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక బరిలో నిలబడనున్న రేగా కాంతారావు గెలుపును ఎవరు ఆపలేరని ప్రజలు మాట్లాడుకోవడం గమనించాల్సిన విషయం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు అనేక కుటుంబాలు ఆకర్షితులై గులాబీ దళంలో చేరుతుండడంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన సెంటర్లలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతుండడంతో గులాబీ కుటుంబం రోజురోజుకు బలపడుతుండడంతో పాటుగా కాంగ్రెస్ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తుందని పలువురు మాట్లాడుకోవడం జరుగుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !