గడపగడపకూ ప్రచారంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
మన్యంన్యూస్,ఇల్లందు:మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య చేపట్టిన గడపగడపకూ కాంగ్రెస్ కార్యక్రమం మున్సిపాలిటీలోని 24వ వార్డుకు మంగళవారం చేరుకుంది. ఈ సందర్భంగా వార్డునందు గడపగడపకూ కాంగ్రెస్ పార్టీప్రచారం నిర్వహించిన కోరం రాబోవు ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం తధ్యమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మున్సిపల్ ఛైర్మెన్ ఎదల్లపల్లి అనసూర్య, పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియేలు, పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, ఎస్సీ, ఎస్టీసెల్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్, నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్ పత్తి స్వప్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రంజిత్, మడుగు సాంబమూర్తి, బొల్ల సూర్యం, జీవీ భద్రం, వాసుదేవ్, వెంకటనారాయణ, ఇమామ్, రమేష్, రావూరి సతీష్, మహిళా నాయకురాళ్ళు స్వరూప, నిర్మల, మదారమ్మ, సర్పంచులు పాయం లలిత, కల్తీ పద్మ, పాయం స్వాతి, ఎంపీటీసీలు మండల రాము, పూనెం సురేందర్, తాటి బిక్షం, కిన్నెర నర్సయ్య, చెన్నూరి కృష్ణ, చెన్నూరి రమేష్, కోరం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
