మన్యం న్యూస్ ,వాజేడు :
వాజేడు మండలం ఎంపీడీవో కార్యాలయంలో దశాబ్ద కాలం అభివృద్ధి సాధికారిక జ్ఞాపకాలు ఫోటో ఆల్బమ్ ను ఎంపీడీవో విజయ,ఎంపిఓ శ్రీకాంత్ నాయుడు ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధికారిత కొరకు రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవి 2014 జూన్ 2 తేదీ నుండి మొదలుకొని నేటి వరకు పలు రకాల సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ప్రభుత్వ కృషి ఫలితంగా రైతులు వ్యవసాయం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులు, చేనేత కార్మికులకు చేయూతనిచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా కార్పొరేట్ సంస్థలు, సెక్రటేరియట్, హైదరాబాద్ దిశ దశను మార్చేసిన ప్రభుత్వంగా, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని,ఎంపీడీవో, ఎంపీ ఓ కొనేడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాలం శివరామకృష్ణం రాజ్, సెక్రటరీ శిరీష, పాల్గొన్నారు.