మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 29
మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విశ్వ విజేత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చందు జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకొని వ్యాయామ ఉపాధ్యాయులను శాలువాల తో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా వ్యాయామ ఉపాధ్యాయులకు విప్ రేగా కాంతరావు క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వీరస్వామి,సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుల పోలేబోయిన అనిల్ కుమార్,జనార్ధన్,వీరన్న,కోడి ఆదినారాయణ,తదితరులు పాల్గొన్నారు.