మన్యం న్యూస్ మణుగూరు :ఆగష్టు 29
మణుగూరు 100 పడకల ఆసుపత్రి లో విప్ రేగా కాంతారావు వీరాభిమాని సొందే ప్రవీణ్ డెంగీ,మలేరియాకే,విష జ్వరాలతో బాధపడుతున్న బాధితులకు సుమారు 50 మందికి బ్రెడ్లు పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు సేవ కార్యక్రమాలు చెప్పడం జరిగింది అన్నారు.ఇందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బ్రెడ్లు పంపిణి చేశామన్నారు.భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో మణుగూరు టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం సృజన్ రాజ్,యువజన నాయకులు,జక్కం రంజిత్ కుమార్,వుల్లోజు బాబీ, గుంటక యేశవ్,రావులపల్లి వెంకట్,సిరికొండ సంగీత్,రేగా సోషల్ మీడియా వారియర్ తోటమల్ల శివ శంకర్,డేగల సంపత్ కుమార్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.