మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 29
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావును సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా ఆశా వర్కర్లు తమ సమస్యలను విప్ రేగా కాంతారావుకు వివరించారు.సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలనీ విప్ రేగా కు వినతి పత్రం అందజేశారు.సమస్యల పై విప్ రేగా స్పందిస్తూ,సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు,సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.