UPDATES  

 ఆగని “గంజాయ్” ఘాటు!

ఆగని “గంజాయ్” ఘాటు!
* మత్తులో యువత జీవితాలు చిత్తు
* పట్టుబడుతున్న జోరు తగ్గని దందా
* తాజాగా పాల్వంచ కొత్తగూడెంలో పట్టివేత
* ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
దమ్మారో దమ్.. మిట్ జాయ్ జం అంటూ యువత గం’జాయ్’ మత్తులో జోగుతోంది.. దీనితో వారు బంగారు భవిష్యత్ నాశనం
చేసుకుంటున్నారు.. గంజాయ్ కి ప్రతి ఒక్కరు బానిసై వాతావరణాన్ని పొల్యూట్ చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. మత్తు పదార్థాల రవాణాకు చెక్ పెట్టడానికి అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న గంజాయ్ దందా
మాత్రం ఆగడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం సమీప పరిసరాల ప్రాంతాల నుండి గంజాయ్ స్మగ్లింగ్ జోరుగా జరగడంతో పలువురిని కలవరపెడుతోంది. ఈ దందా
గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగడం విస్మయం కల్గిస్తోంది. గతంలో అనేకమార్లు భద్రాచలంలోనే ఎక్కువగా గంజాయ్ బస్తాలు దొరిన సంఘటనలు అనేక ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే భద్రాచలం పరిసర ప్రాంతాల నుండి ఇతర ప్రాంతాలకు సరఫరా జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి రవాణాతో పాటు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చట్టవ్యతిరేకమైన గంజాయి రవాణా, అమ్మకాలు అరికట్టడంలో సంబంధిత ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలం అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొందరు గంజాయి స్మగ్లర్లు కొత్త పద్ధతిని ఎంచుకొని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా జిల్లాకు తరలిస్తున్నారనే ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొస్తున్న పలువురు స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అలా కిలోలకొద్ది గంజాయి కొనుగోలు చేసేవారు వాటిని చిన్న ప్యాకెట్లలో నింపుతూ రెగ్యులర్ కస్టమర్లకు విక్రయిస్తున్నారు. ఫుల్లు కిక్కునిచ్చే ఈ గంజాయి ప్యాకెట్లను తక్కువ డబ్బుకే మత్తులోకి జారుకోవడం అలవాటుపడిన వారు కొనుగోలు చేయడంతో చిన్నపాటి స్మగ్లర్లు కాసుల పంట పండుతుంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఈ గంజాయి విక్రయించే అడ్డాలు ఉండడం అటు ఎక్సైజ్, ఇటు పోలీసులకు సవాలుగా మారింది. కొంతమంది కొత్తగూడెం బస్టాండ్ పరిధిలోని రైల్వే డక్కా, రైల్వే అండర్ బ్రిడ్జి, గోదుమవాగు బ్రిడ్జి, ముర్రేడు బ్రిడ్జి, ఇల్లెందు క్రాస్ రోడ్డు ప్రాంతాల్లో గంజాయిని దర్జాగా
విక్రయాన్ని నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా కొన్ని ఏరియాలలో గంజాయి దందా జోరుగా సాగుతుంది. తాజాగా కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం 14 నెంబర్ ఏరియాలో 17.6 కేజీల గంజాయి దొరికింది. అంతేకాకుండా పాల్వంచ పట్టణంలో కూడా భారీగా గంజాయి దొరకడం కలవరపెడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గంజాయ్ రవాణా కాకుండా చర్యలు తీసుకోవాలని
ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !