మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
కొత్తగూడెం సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో బుధవారం రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణంపై మొక్కల సంరక్షణపై అవగాహన పెంచేందుకు వృక్ష రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ , విద్యార్థులచే స్వయంగా రాఖీలను తయారు చేయించి వృక్షాలకు కట్టించారు. వినూత్నంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెడ్మాష్టర్ పూల్‌సింగ్ , సీనియర్ సైన్స్ ఉపాధ్యాయురాలు మధురవాణిలు మాట్లాడుతూ వృక్షోరక్షతి రక్షిత అన్న నానుడిని అనుసరించి విరివిగా మొక్కల్ని నాటి వాటిని రక్షించాలని తెలిపారు. వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడతాయనే గ్రహింపు కలిగి వుండాలనే సదాలోచనతో పాఠశాల ఎన్విరాన్మెంటల్ టీం విద్యార్ధులచే పాఠశాలలోని దాదాపు అన్ని చెట్లకు రాఖీలు కట్టించి వాటిని రక్షిస్తామనే ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ సమీనా, మల్లీశ్వరి, ఉష, శ్రీదేవి, వనిత, శివరంజని, దేవప్రియ, నాగమణి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.