రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే
* కాంగ్రెస్ పాలనలోనే ప్రతి ఒక్కరికి న్యాయం
* తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని
కాంగ్రెస్ పాలనలోనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. తర్వాత పాల్వంచ మండలంలోని గంగాదేవి గుప్పా, దంతెలబోర గ్రామాలను కొత్తగూడెం మండలంలోని రామవరం ప్రశాంత్ నగర్ గ్రామాలను సందర్శించారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ఆశీస్సులతో రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, తూము చౌదరి, నాగ సీతారాములు, సర్పంచ్ తెల్లం అలివేలు, మల్లేష్, వీకా బక్కులు, కుంజా రామకృష్ణ, కాకాని ప్రసాద్, కాకా రమేష్, తుమ్మల శివారెడ్డి, యర్రంశెట్టి ముత్తయ్య, పిట్టల రామారావు, ధర్మసోతు ఉపేందర్ నాయక్, సమ్మెట వెంకట అప్పారావు, తాళ్లూరి సత్యనారాయణ, ఆవుల మధు, ఇజ్జగాని రవిగౌడ్, పవన్, శ్రీరాములు, యర్రగుంట రవి, పాపోలు నాగేశ్వరరావు, తాళ్లూరి షణ్ముఖచారి, బొలగం పల్లి రవి, ప్రసాద్, చింతా నాగరాజు తదితరులు ఉన్నారు.