మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఆత్మ కమిటీ చైర్మన్ గా నియమితులైన
ఎల్.వెంకటేశ్వర్లని ఆయన మిత్రబృందం బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిత్రబృందం తనకు సన్మానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలను హరిజనులు గిరిజనులు నిన్న జాతి వర్గాలందరూ కూడా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లావుడియా శ్రీను చౌహాన్ మంద హనుమంతు నవతన్ సనుప రమేష్ నునవత్ గాంధీ కిలారు యాకూబ్ పాషా కుమార్ లావుడియా దిలీప్ కుమార్ లావుడియా సాదు లావడియ నరేష్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.