మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం టౌన్:
భారతీయ జనతా పార్టీ లక్ష్మీదేవిపల్లి మండలం మహిళా మోర్చా ఆధ్వర్యంలో బుధవారం రాఖి పౌర్ణమి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీజేపీ జిల్లా కార్యాలయం, లక్ష్మీదేపల్లి మండల పోలీస్ స్టేషన్, తాసిల్దార్ ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్, లక్ష్మీదేవిపల్లి ఉన్నత పాఠశాలలో రాఖీ సందడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీనివాస్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అగర్వాల్, లక్ష్మీదేవి పల్లి మండల ప్రధాన కార్యదర్శి మాలోత్ గాంధీ, మహిళా మోర్చా నాయకులు సమ్మక్క, వరలక్ష్మి, రమాదేవి, కవిత తదితరులు పాల్గొన్నారు.