మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఓటరు జాబితా ప్యూరిఫికేషన్కు వచ్చే నెల 2, 3 తేదీలల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. బుధవారం ఐడిఓసి మిని సమావేశపు హాలులో
బూతు ఏజెంట్లు నియామకం, సెప్టెంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపులు, ముసాయిదా ఓటరు
జాబితాపై అభ్యంతరాలు మరణించిన చిరునామా మారిన ఓటర్లు, డూప్లికేటు ఓటర్లు తొలగింపు తదితర అంశాలపై
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ఎన్నికల
ప్రక్రియ ముగిసేంతం వరకు ఎన్నికల సంఘ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంతో
పాటు అన్ని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపుల్లో జిల్లాలోని
1095 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ జాబితాలో పేరు ఉన్నదో లేదో పరిశీలన చేసుకోవాలని చెప్పారు. ప్రత్యేక క్యాంపులు నిర్వహణ సమాచారం క్షేత్రస్థాయిలో తెలిసే విధంగా గ్రామాలు, పట్టణాల్లో టాం.. టాం వేయించాలని చెప్పారు. ఓటరు జాబితా పరిశీలోని గుర్తించిన
అభ్యంతరాలను నిర్దేశిత ఫారాలలో వివరాలు అందచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం తహసిల్దార్ ప్రసాద్, నాయబ్ తహసిల్దార్ రంగప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ
నుండి సిహెచ్ ప్రసాదరావు, బిజెపి నుండి లక్ష్మణ్ అగర్వాల్, నోముల రమేష్, బిఆర్ఎస్ పార్టీ నుండి షేక్ అన్వర్, సిపియం నుండి అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.