మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రజలకు సేవ చేయడంతో పాటుగా కొత్తగూడెం అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే వనమా కొత్తగూడెంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సుమారు రూ.30 కోట్ల అభివృద్ధిపనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. చివరి రక్తపు బొట్టు వరకు కొత్తగూడెం ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. కొత్తగూడెం పాల్వంచ పట్టణాలను జంటనగరాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసిఆర్ చలువతో విజయం సాధిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపుసీతాలక్ష్మి, కౌన్సిలర్లు మోరె రూప, కూరపాటి విజయలక్ష్మి, కోలాపురి ధర్మరాజు, వేముల ప్రసాద్, పల్లపు లక్ష్మణ్, పులిగీత, పరమేష్ యాదవ్, కంచర్ల జమలయ్య, మునిగడపు పద్మ, భూక్యా శ్రీను, బి.ఆర్.ఎస్.నాయకులు ఎంఏ రజాక్, కాసుల వెంకట్, జేవిఎస్ చౌదరి, మోరె రమేష్, గౌస్, కూరపాటి సుధాకర్, బాలాజీనాయక్,
భూక్యా శ్రీను, మజీద్, సురేందర్, పురుషోత్తం, రెడ్డి బ్రదర్స్, తొగరు రాజశేఖర్, ఆవునూరి చంద్రయ్య, కొయ్యాడ శ్రీను, దొమ్మేటి నాగేశ్వరరావు, సూర్యనారాయణ, పితాని సత్యనారాయణ, అరుణ్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మున్సిపల్ శాఖాధికారులు పాల్గొన్నారు.