మన్యం న్యూస్ కొత్తగూడెం టౌన్:
లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ గ్రామపంచాయతీ లోని ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రక్షాబంధన్ రాఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాఠశాలలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఒకటి నుంచి ఐదో తరగతులలోని విద్యార్థులకు విద్యార్థినులు రాఖీలు కట్టి రాఖీ పండుగ విశిష్టతను చాటి చెప్పారు.
రాఖీ కట్టిన వారికి విద్యార్థులు పెన్నులు పెన్సిళ్ళు కానుకగా అందజేశారు.
స్కూల్ హెచ్ఎం ఎం.జ్యోతిరాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చాంద్పాషా, టీచర్ లు
శౌరి ఇన్నయ్య, షాజియాతబ్సుమ్, భవిత కేంద్రం టీచర్లు జానకి, స్వప్న, పేరెంట్ టీచర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.