UPDATES  

 సింగరేణి కార్మికులకు 23నెలల వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లించాలి

*సింగరేణి కార్మికులకు 23నెలల వేజ్ బోర్డు ఏరియర్స్ చెల్లించాలి
* జీఎంకు వినతిపత్రం అందజేసిన బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు నాయని సైదులు

మన్యం న్యూస్,ఇల్లందు:కోల్ ఇండియా మాదిరిగా ఎన్సీడబ్ల్యుఏ 11వ వేతన ఒప్పందం ప్రకారం సింగరేణి కార్మికులకు 23నెలల ఏరియర్స్ ను తక్షణమే ఆగస్టునెల జీతంతో కలిపి సెప్టెంబర్ 3న చెల్లించాలని బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి ఉపాధ్యక్షులు నాయని సైదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఎంఎస్ నాయకులతో కలిసి బుధవారం సాయంత్రం జీఎంకు మెమోరండం అందించడం జరిగింది. అనంతరం నాయని సైదులు మాట్లాడుతూ..సింగరేణి కార్మికులకు జేబీసీసీఐ ఒప్పందం మే20వ తారీఖున కోల్ కతాలో ఒప్పందం జరిగిన వెంటనే జూన్ మాసం నుండి కొత్తజీతభత్యాలు కోలిండియాలో చెల్లించిన మాదిరిగా సింగరేణి కార్మికులకు 23నెలల పెండింగ్ ఏరియర్స్ ను ఆగస్టునెల జీతంతో సెప్టెంబరు 3న తక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తికి గానూ 32,184 కోట్లు వచ్చిందని తెలిపారు. రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న సింగరేణి సంస్థలో ఏరియర్స్ చెల్లించడానికి ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం మూలముగా సింగరేణి కార్మికులు అసంతృప్తికి గురవుతున్నారని తక్షణమే ఏరియర్స్ చెల్లించుటకు సర్కులర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఇల్లందు సెక్రటరీ లీలాకృష్ణ, సెంట్రల్ కమిటీ ఆర్గనైజర్ ఆరుట్ల మాధవరెడ్డి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఏరియా ఉపాధ్యక్షులు రాము, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !