ములకలపల్లి,మన్యం న్యూస్ ఆగష్టు 30.మండలం లోని పాలవాగు గ్రామం లో అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యురాలు వగ్గేల పూజ, ఎస్ సి, ఎస్ టి డిక్లరేషన్ , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించబోయే పథకాలను గ్రామస్థులకు వివరించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రచారం చేసారు.ఈ కార్యక్రమం లో తలగని శోభనద్రి, గుంటూరు ముత్తయ్య, పామర్తి కృష్ణ, గుంటరు సాయిరాం, మేకపోతుగుల వెంకటేశారావు, పామర్తి రమేష్, పామర్తి కృష్ణ,మడకం నరసింహారావు, మడకం సురేష్, మడకం రామచంద్రరం, గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
