మన్యం న్యూస్, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగ కాంతారావు సతీమణి రేగ సుధారాణి వారి యొక్క ఆత్మీయ అన్న తమ్ముళ్లకు రాఖీ కట్టిన రేగ సుధారాణి. మణుగూరు పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు సహోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని రక్షా బంధన్ వేడుకలు సోదరభావంతో తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం, అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర బాధ్యత అనే కర్తవ్యాన్ని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని అన్నారు.సోదరభావంతో, ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే ఈ వేడుక భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని అన్నారు. పౌర్ణమి పర్వదినం సందర్భంగా రేగ సుధారాణి ఆత్మీయ సోదరులు చింతిర్యాల కాలనీ సర్పంచ్ పాయం భద్రయ్య కి ,అశ్వాపురం మండల బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటరమణాకి రాఖి కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.