మన్యం న్యూస్ మణుగూరు: సెప్టెంబర్ 1
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఆదేశాల మేరకు మొదటి రోజు కెసీఆర్ పల్లె ప్రగతి బాట కార్యక్రమం లో భాగంగా మణుగూరు మండలం లోని ఖమ్మం తోగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కెసిఆర్ సంక్షేమ పథకాలను, ప్రజలకు వివరిస్తున్న పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ నవీన్ బాబు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధి,సంక్షేమానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు, కూనవరం గ్రామ బీసీ సెల్ అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు,బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సూర్యం, రాము,రఘు,డాన్స్ మాస్టర్, శేఖర్,గోపి,తదితరులు పాల్గొన్నారు.