UPDATES  

 తాత వద్దు… బాలసాని ముద్దు

తాత వద్దు… బాలసాని ముద్దు
భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ లో ఒక్కసారిగా బయటపడ్డ వర్గ విభేదాలు……

*నియోజకవర్గ ఇన్చార్జ్ బాలసానినే కావాలంటున్న ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు.
మన్యం న్యూస్, చర్ల:
చర్ల మండల కేంద్రంలోనీ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో బిఆర్ఎస్ పార్టీ ఐదు మండలాల అధ్యక్ష కార్యదర్శుల రహస్య సమావేశం నిర్వహించడం జరిగింది. తమ నాయకుడు బాలసానిని కాదని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుకు భద్రాచలం నియోజకవర్గం బాధ్యతలు ప్రకటించడం పట్ల వ్యతిరేకించారు. అలాగే పార్టీ కాదని వేరే పార్టీలోకి చేరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చే అవకాశం లేనందున తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఐదు మండలాల అధ్యక్షులు కార్యదర్శులు వ్యతిరేకించారు. పార్టీని నమ్ముకొని పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన నాయకులను కాదని వెంకట్రావు కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఏమాత్రం సబము కాదని వారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ మార్పులను త్వరలోనే తెలంగాణ విప్ రేగా కాంతారావుకు తెలిపి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లటం జరుగుతుందని అలాగే భద్రాచలం నియోజకవర్గం గురించి అణువణువునా తెలిసిన వ్యక్తి బాలసాని లక్ష్మీనారాయణ కు నియోజకవర్గ ఇన్చార్జి, ఎన్నికల అధికారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అనంతరం అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చి ప్రకటిస్తుందో అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో భద్రాచకం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ఐదు మండలాల అధ్యక్ష కార్యదర్శులు ముక్తాకంఠంగా చెప్పారు. ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వర్గ పోరు నాయకుల తీరుతో ఈసారైనా భద్రాచలం నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయగలరు లేదో చూడాలని అంటున్న రాజకీయ విశ్లేషకులు. ఈ కార్యక్రమంలో భద్రాచలం అధ్యక్షులు తిరుపతిరావు, దుమ్ముగూడెం మండల కార్యదర్శి జానీ పాషా, చర్ల మండలం అధ్యక్షులు సోయం రాజారావు, వెంకటాపురం మండల అధ్యక్షులు గంప రాంబాబు, వాజేడు మండల అధ్యక్షులు పెనుముల్లు రామకృష్ణారెడ్డి, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !