మన్యం న్యూస్ దుమ్ముగూడెం సెప్టెంబర్ 1::
మండలంలోని గంగోలు డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో ముత్యాలరావుకు వినతిపత్రం అందించారు. ఏడాది నుంచి కాలనీవాసులు మంచినీటి సౌకర్యం విద్యుత్తు లైట్లు లేక ఇబ్బందులు గురవుతున్నారని గోదావరి వరదమపు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం వల్ల ముంపు గురవుతున్నారని వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎంపీడీవో రెండు రోజుల్లో మంచినీళ్లు విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ, నాయకులు రామిశెట్టి, వెంకటేశ్వర్లు, భీమయ్య, శ్రీనివాసరావు, చెల్లెమ్మ, తులసి, తదితరులు పాల్గొన్నారు.