మన్యం న్యూస్, నూగురు వెంకటాపురం:
ఆగస్టు 14న పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు వచ్చిన వలస కూలి మైనర్ బాలిక చావుకు కారణమైన హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని జయశంకర్ మహబూబాబాద్,వరంగల్ పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ శుక్రవారం విడుదల చేసినఒక ప్రకటనలో తెలియజేశారు.
మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలు భవన కార్మికులుగా పనిచేస్తున్న క్రమంలో రియల్ ఎస్టేట్ లో వెంచర్లో పనిచేస్తున్న నమ్రితను , మేస్త్రి గోపాల్ తన ఇంట్లో పని ఉందని చెప్పి తీసుకువెళ్లి మరోముగ్గురు తో కలిసి నోటిలో గుడ్డలు కుక్కి సామూహికంగా అత్యాచారం చేశారు. అత్యాచారం చేసి పెద్దపల్లి బస్టాండ్ లో వదిలేశారు, ఆమెతో పనికి వచ్చిన అప్పన్నపేట గ్రామానికి చెందిన తోటి కూలీలు నమ్రితాను గుర్తించి ఆమె అక్క బావలకు అప్పగించారు,
విషయం తెలుసుకొని మేస్త్రి గోపాల్ ని అడిగాగా విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఒక వాహనం మాట్లాడి నమ్రితను వాళ్ళ అక్క బావలను మధ్యప్రదేశ్ కు పంపిస్తుండగా
అప్పటికి తీవ్ర రక్తస్రావంతో ఉన్న నమ్రిత మార్గoమధ్యలో చనిపోయింది.
బాలిక అత్యాచార ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి హంతకులను వెంటనే శిక్షించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు.
