UPDATES  

 ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అదిష్టానానికి ధన్యవాదాలు తెలిపిన ఇల్లందు కాంగ్రెస్ నాయకులు

ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అదిష్టానానికి ధన్యవాదాలు తెలిపిన ఇల్లందు కాంగ్రెస్ నాయకులు
స్వార్థ రాజకీయాలు మానుకోవాలని ఇల్లందు కాంగ్రెస్ నాయకుల హితవు

మన్యం న్యూస్,ఇల్లందు దళిత, గిరిజన, ఆదీవాసీల అభ్యున్నతి కొరకు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే చేతులమీదుగా చెవెళ్ళ భారీ బహిరంగసభలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించినందుకు ధన్యవాదములు తెలుపుతూ పట్టణంలోని స్థానిక ఐఎన్టీయూసీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, దళ్ సింగ్ నాయక్, మంగిలాల్ నాయక్, శంకర్ నాయక్, డాక్టర్ రవిలు హాజరైయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్, సరూర్ నగర్ యూత్ డిక్లరేషన్లతో పాటుగా దళిత, గిరిజన, ఆదీవాసీ డిక్లరేషన్ ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నాయకులు మల్లుభట్టి విక్రమార్క, భధ్రాద్రి డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్యలకు అధిష్టాన పెద్దలందరికి ధన్యవాదములు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్టీసెల్ ఛైర్మెన్ గా ఎన్నికైన డాక్టర్ రవిని నాయకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు టౌన్, మండల, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !