మన్యం న్యూస్ ,ములకలపల్లి.01: మండల కేంద్రం లోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఆవాస విద్యాలయం లొ,లయన్స్ క్లబ్ అఫ్ పాల్వంచ కిన్నెరసాని అధ్యక్షులు కేదారేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ వర మహాలక్ష్మి వ్రత పూజలు శుక్రవారం నిర్వహించారు. పూజ అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన ములకలపల్లి ఎంపీటీసీ శనగపాటి మెహర్రమణి చేతుల మీదుగా కుంకుమ భరినులను 50 మంది ముత్తయదువులకు అందించారు. పూజా అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ కిన్నెరసాని ఆధ్వర్యంలో,ఎంపీటీసీ మెహర్రమని, పాఠశాల ఆచార్య బృందం చేతుల మీదుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటటం జరిగింది.ఈ కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేదారేశ్వరరావు మాట్లాడుతూ మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో పాటుగా ఆత్యాత్మిక కార్యక్రమాలలో పర్యావరణాన్ని కాపాడడం లొ భాగంగా మొక్కలు నాటటం జరుగుతున్నదని, ప్రతి ఒక్కరు ఒక్క చెట్టయినా నాటలని అన్నారు. ఈ కార్యక్రమం లో క్లబ్ సెక్రటరీ రేపాక ప్రసాదరావు, క్లబ్ ట్రెసరర్ రంజాన్,సభ్యులు ఆనంతుల మహేష్, శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానాచార్యులు కుంజా జగన్,వారి ఆచార్య బృందం, గ్రామ మహిళలు పాల్గొన్నారు.
