UPDATES  

 ఇల్లందులో పొంగులేటి, కోరంల ఆధ్వర్యంలో భారీప్రదర్శన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 

మన్యం న్యూస్,ఇల్లందు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన భారీప్రదర్శనకు తెలంగాణా రాష్ట్రప్రచార కమిటీ కోఛైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ నుంచి ఆంబజార్, బగ్గవాగు, గోవింద్ సెంటర్ల మీదుగా జగదాంబ సెంటర్ వరకు నిర్వహించిన భారీప్రదర్శన కార్యక్రమంలో ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తలతో కలిసి నడిచారు. అనంతరం జగదాంబ సెంటర్ వద్దగల తెలంగాణా తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసారు. ఈ సందర్భంగా పొంగులేటి, కోరం కనకయ్యలు ప్రసంగిస్తూ..కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో కెసీఆర్ ప్రభుత్వవైఫల్యాల వల్లే సామాన్య ప్రజలపై అధికభారం పడుతుందని, రానున్నఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని వారు అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను తమసొంత జాగీరులా భావించటం సరికాదని, ఎమ్మెల్యేచెప్పిన వారికే ప్రభుత్వపథకాలు అమలు చేయడం, అభివృద్ధి పనులకోసం ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేపించుకోవడం అలవాటుగా మారిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలు అమలుచేయడంలో విఫలం చెందారని, అమలు చేస్తున్నట్టు ప్రచారం చేయడంలో మాత్రం సఫలం అయ్యారని ఎద్దేవా చేశారు.
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై, ఒకటవవార్డుల నుంచి 35 కుటుంబాలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పొంగులేటి కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ యధల్లపల్లి అనసూర్య, పట్టణ,మండల అధ్యక్షులు దొడ్డా డానియేలు, పులి సైదులు, ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్, ఎస్టీ, ఎస్సీసెల్ అధ్యక్షులు నాగరాజు, లింగంపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్ పత్తి స్వప్న, నాయకులు భద్రం, ఇమామ్, వెంకట నారాయణ, మసూద్, మహాబూబ్, పత్తి రంజిత్, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !