UPDATES  

 రాజకీయ విలువలు తెలిసిన వ్యక్తి తుమ్మల

రాజకీయ విలువలు తెలిసిన వ్యక్తి తుమ్మల
* సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క
* తుమ్మల ఇంటికి వెళ్ళిన సీఎల్పీ నేత విక్రమార్క
* తుమ్మలతో కాంగ్రెస్ పెద్దలు వరస భేటీలు
* ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మారుతున్న పొలిటికల్ సీన్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రాజకీయాల్లో దిగ్గజంగా ముద్ర వేసుకున్న సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పెద్దలు ఒకరి తర్వాత ఒకరు కలుస్తుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కడంతో పాటుగా చర్చ నియాంశంగా మారింది. మొన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా తాజాగా ఆదివారం సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే
భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావును కలవడం జరిగింది. దీంతో ఖమ్మం జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకోవడం గమనించాల్సిన విషయం. తుమ్మలను భట్టి విక్రమార్క కలిసిన తర్వాత ముందుగా తుమ్మల ఆయనను సన్మానించగా తర్వాత భట్టిని తుమ్మల సన్మానించారు. అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలలో విలువలు కలిగిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరావు అని కొనియాడారు. తుమ్మల మంత్రిగా ఉన్న సమయాలలో ఖమ్మం జిల్లాను, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశాడని తెలిపారు. తుమ్మల కాంగ్రెస్ లోకి వస్తే ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడానికి ఆయన ఇంటికి రావడం జరిగిందని భట్టి పేర్కొన్నారు. దీంతో తుమ్మల స్పందిస్తూ తన అభిమానులు కార్యకర్తల అభిప్రాయం మేరకు తన నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !